Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాక బ్రిలియంట్ హై స్కూల్, జూనియర్ కాలేజ్లో సోమవారం చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్, ఫ్యాన్సీ షో కాంపిటీషన్స్ నిర్వహించారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బి.ఎన్.ఆర్ పూలమాలవేశారు. ఈ కాంపిటీషన్స్కు మండలంలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం బ్రిలియంట్ స్కూల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఫ్యాన్సీ షో కాంపిటీషన్ నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా బిఎన్ఆర్ మాట్లాడుతూ క్రీడలు ఆత్మ స్థైర్యంకు మూలమని ఆయన అన్నారు. ఇలాంటి ఉత్సవాలు పిల్లలకి ఉత్సాహాన్ని కలిగించడమే కాకుండా చదువుపై ఆసక్తిని కూడా కలిగిస్తుందని ఆయన తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని దేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన కోరారు. ఈ కాంపిటీషన్లో పాల్గొన్న గెలుపొందిన విద్యార్థులకు బ్రిలియంట్ విద్యాసం స్థల చైర్మన్ బీఎన్ఆర్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, హెడ్ మిసెస్ స్వర్ణకుమారి పాల్గొన్నారు.