Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గల్లీ నుంచి ఢిల్లీకి
- ఆపదలో ఉన్న వారికి ఆపధ్బాందవుడు
- అతనే మేమున్నాం కమిటీ చైర్మెన్ నీలి ప్రకాష్
- సేవారత్న అవార్డు పొందిన సందర్భంగా...
సేవాసంస్థ చైర్మన్ అందరూ బాగుండాలి...అందులో మేము ఉండాలని కోరుకునే వ్యక్తి అతనే నీలి ప్రకాష్. అందుకే ఆ సంస్థ పేరు ''మీకోసం మేమున్నాం'' ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన పేరు వినబడే విధంగా ముందుకు దూసుకొని పోతున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఢిల్లీకి చెందిన బహుజన సాహిత్య అకాడమీ ''సేవారత్న'' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 13న ఢిల్లీలో అవార్డు పొందిన సందర్భంగా నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కధనం.
నవతెలంగాణ-చర్ల
తెలంగాణా రాష్ట్రం. అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలంలోని చర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆపదలో ఉన్న వారికి ఆపన్నుడు, బాధిత కుటుంబాలకు ఓ అండగా ఉంటూ, రోగులకు ఆపద్బంధువు, ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు వారం వారం అన్నదానం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి వారపు సంతకు వచ్చే పేదలకు దుస్తులు పంపిణీ, చెప్పులు లేని వారికి చెప్పులు పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి, మరిన్ని సత్కారాలు పొందాలని మనమూ ఆశిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే... 2004లో చర్లలో పర్యావరణ పరిరక్షణ కమిటీతో సేవా కార్యక్రమాలకు నీలి ప్రకాష్ శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన వైవి గణేష్ నాయకత్వంలో స్థానిక పెద్దలు, పాత్రికేయులు కమిటీగా ఏర్పడి చర్లలో మొక్కులు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. నాడు నాటిన మొక్కలు నేడు ఎంతో మందికి నీడను ఇస్తున్నాయి. 2018 నుంచి 2019 వరకు రెండు సంవత్సరాల పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ చర్ల గ్రేటర్‌కు అధ్యక్షుడిగా పని చేశారు. ''మీకోసం మేమున్నాం'' కమిటీ ద్వారా వెయ్యికి పైగా సేవా కార్యక్రమాలు. ప్రాధమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు 1650 మంది విద్యార్థులకు నొటు పుస్తకాలు, బ్యాగులు, పలకలు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ, వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ, పేదల అంత్యక్రియలకు ఆర్థిక సహాయం, అంతర్జాతీయ టార్గెట్ బాల్ క్రీడాకారులకు చేయూత, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సాయం, దళితులు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు పంపిణీ, ఇటీవల చర్ల మండలంలో సంబంధించిన గోదావరి వరదల కార ణంగా ముంపునకు గురైన బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ, రక్త దానం శిబిరం ఏర్పాటు చేసి వందల మందికి రక్త దానం, పర్యా వరణ పరిరక్షణ కోసం వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ, 50 మందికి పైగా కంటి ఆపరేషన్లు, కరోనా సమయంలో మేము న్నాం కమిటీ ఆధ్వర్యంలో 1000 మందికి నిత్యావ సర సరుకుల పంపిణీ, కరోనా బారిన పడి మృతి చెందిన వారికి దహన సంస్కరణలు నిర్వహించారు.
చర్ల గ్రంధాలయంకు పుస్తకాలు వితరణ
చర్ల మండలంలోని ప్రజలను చైతన్య పరిచి ధార్మిక, సేవా కార్యక్రమాలు వైపు ఉత్తేజ పర్చటం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న చర్ల వాసి నీలి ప్రకాష్ చేస్తున్న సేవలకు గాను దేశరాజధానికి చెందిన బహుజన సాహిత్య అకాడమీ వారిచే జాతీయ స్థాయిలో సేవారత్న అవార్డు పొందిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధువు. స్వల్ప కాలంలోనే ఈ స్థాయికి రావడానికి తనకు అన్ని విధాలా సహకరించిన దాతలకు, మేమున్నాం కమిటీ సభ్యులకు చర్ల మండల ప్రజలకు ఈ అవార్డును అంకితం చేశారు.