Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలి రేట్లు పెంచాలి
- పోడు భూములకు పట్టాలివ్వాలి
నవతెలంగాణ-దమ్మపేట
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి, పేదలను దోపిడీ చేస్తున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్‌లు విమర్శించారు. సోమవారం చెన్నుపాటి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన 7వ మండల మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. రెక్కల కష్టంతో బతుకుతున్న పేదలకు ప్రభుత్వం నల్లదనం పంచుతానని, పేదలను దనవంతులను చేస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న మోడీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి జేబులకు చిల్లు పెడుతుందని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచుతూ కొత్త జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మండలంలో పోడు సాగుదారులందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.చిరంజీవి, రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మినారాయణ, పెనుబల్లి నానారావు, మోరంపూడి కేశవరావు, శ్రీనివాసరావు, కాంతారావు, సూర్య నారాయణ, రావూరి బ్రహ్మం, పోలమ్మ, రాంప్రసాద్, జగపతి, మాణిక్యం, జ్యోతి, కాక శ్రీను, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.