Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలలు వాహనాలు నిలుపుదలకు స్థలం కేటాయింపు
- పరిష్కారం కానున్న దీర్ఘకాలిక సమస్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అనే సమర నినాదం ఆలంబనగా ప్రశ్నిస్తేనే సమాధానం, వేడుకుంటే నే వేదనకు పరిష్కారం దొరుకుతుందని రుజువు చేసారు తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ నాయకత్వం. గెలలతో పరిశ్రమకు వచ్చిన వాహనాలు పరిశ్రమ ప్రాంగణంలో సరైన ఖాలీ స్థలం లేక దిగుమతి జాప్యం కావడంతో ఆ వాహనాలు అశ్వారావుపేట-సత్తుపల్లి ప్రధాన రహదారిపై పరిశ్రమ సమీపంలో నిలపడంతో వాహన రాకపోకలు అంతరాయం మే కాకుండా అజాగ్రత్తగా, అతి వేగంతో వచ్చిన వాహనాలు రహదారి పక్కనే నిలిపి ఒకదానికొకటి ఢకొీట్టడంతో అనే ప్రమాదాలు చోటు చేసుకునేది. అంతేగాకుండా రోడ్డు పక్కనే నిలిపి డ్రైవర్లు ఇంటికి వెళ్తే గెలలుకు సైతం రక్షణ కరువు. ఈ క్రమంలో రైతు సమస్యలు పరిష్కారం కోసం నూతనంగా పురుడు పోసుకున్న సొసైటీ ముఖ్య బాధ్యులు హరిక్రిష్ణ, మహేశ్వర రెడ్డి, పుల్లయ్య, తాతారావులు అనేక మార్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి, ఎండీ సురేందర్, జీఎం సుధాకర్ రెడ్డిలకు స్వయంగా వినతి పత్రాలు అందజేసారు. పలు దఫాలు ఇష్టాగోష్టిగా రైతులు సమస్యలుపై చర్చించారు. ఇందుకు స్పందించిన ఆయిల్ ఫెడ్ పెద్దలు కొన్ని సమస్యలకు పరిష్కారం చేస్తామని వీరికి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం పరిశ్రమల ప్రాంగణంలోనే గల మోడల్ గార్డెన్లో పరిశ్రమ లోపలి దారికి ఇరుప్రక్కల 14 మీటర్ వెడల్పున చెట్లు తొలగించే పనిని సోమవారం ప్రారంభించారు.
దీంతో దీర్ఘ కాలిక సమస్య ఒకటి పరిష్కారం కానున్నది. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ ఇంచార్జీ డీఓ, పరిశ్రమ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ మాట్లాడుతూ ముందుగా ఒక పక్క స్థలం కేటాయించామని, రెండు వరుసల్లో సుమారు 100కు పైగా వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.