Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం బిక్షగా మార్చారు
- పేదరికంతో తగ్గిన కొనుగోలు శక్తి
- సెమినార్లో వ్యకాస జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ-కారేపల్లి
శ్రామికుల శ్రమ నుండి సంపద సృష్టించబడిందని ఆ సంపదలో వాటా కోసం పోరాటం శ్రామికులు పోరాటం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు అన్నారు. సోమవారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో కార్మిక చట్టాలు- ఉపాధిహామీపై సెమినార్ కే.నరేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సెమినార్లో సాయిబాబు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగటం లేదని, ఆదాయం - కొనుగోలు శక్తి మధ్య వ్యత్యాసమే పేదరికమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని సృష్టించే రైతు, కార్మికుల వేతనాలు దిగజారి పోవటం విచాకరమన్నారు. 140 కోట్ల దేశ జనాభాలో 60 కోట్ల మందికి పౌష్టికాహారం అందటం లేదని, 50 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పసిపిల్లలు ప్రాణాలు పోతున్నాయని వీటికి పాలకులు సిగ్గుపడాలన్నారు. కరోనా విపత్తు దేశంలో భయానక పరిస్ధితిని సృష్టించిందని, ఆహార నిల్వలు ఉన్నా కనీసం తిండికి కూడా కేంద్రం ప్రభుత్వం విత్తు జార్చలేదన్నారు. పేదలు పనులు లేక పస్తులుంటుంటే పెట్టుబడిదారుల ఆదాయాల రెట్టింపు అయ్యాన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ తీసుకవచ్చి జీఎస్టీని తినే తిండి మీద కూడా విధిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ పై మాత్రం జీఎస్టీ విధించటం లేదన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తే ధరలు తగ్గి ముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన వస్తువుకు ధర నిర్ణయించే హక్కు ఉంటుందని, రైతు పండించిన పంటకు మాత్రమే కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉందన్నారు. హక్కుల కోసం కార్మికులు, కర్షకులు ఐక్య పోరాటాలతోనే పాలకుల తీరు మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, సర్పంచ్ బానోత్ బన్సీలాల్, ఎంపీటీసీ వడ్డె అజరుబాబు, సీఐటీయు నాయకులు గుంపెనపల్లి నర్సింహరావు, శనక రాంబాబు, తలారి దేవప్రకాశ్, ముండ్ల ఏకాంబరం, దారావత్ సైదులు, కరపటి సీతారాములు, రేగళ్ల మంగయ్య తదితరులు పాల్గొన్నారు.