Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభించిన సీఎం
నవతెంలగాణ-కొత్తగూడెం
దేశానికే మణిహారంగా తెలంగాణ వైద్య విద్య విలసిల్లుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం జిల్లాలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాజేజీని ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని కొత్తగూడెం, రామగుండం, మంచిర్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జగిత్యాలలో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజిలను ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వైద్య, విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం నేడు ఆవిష్కారం అయిందన్నారు. కొత్త మెడికల్ కాలేజిల ప్రారంభంతో స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తాన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా 1150 సీట్లు వచ్చాయని, వైద్య కళాశాలలు ఏర్పాటుతో 850 నుంచి 2790కి మెడిసిన్ సీట్లు పెరిగాయని తెలిపారు. 57 ఏండ్ల ఉమ్మడి పాలనలో 3 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని, స్వరాష్ట్ర సాధన తరువాత 8 ఏండ్ల స్వపరిపాలనలో 12 కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సమాంతరంగా నర్సింగ్ కళాశాలలు, పారా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యా బోధన తరగతులను హైదరాబాదు నుండి వర్చువల్ ద్వారా ప్రారంభించి విద్యార్థుకు రాష్ట్ర సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, డిఎం.ఈ, వైద్యశాఖ డైరెక్టర్లు రమేష్ రెడ్డి, గడల శ్రీనివాసరావు, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ్‌రావు, సూపరింటెండెంట్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.