Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల సంక్షేమం భిక్ష కాదు... అది వారి హక్కు
- టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండపునేని సతీష్
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్య, వైద్యం ఉద్యోగ ఉపాధులో, వికలాంగుల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం(టివిపిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపునేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపాన నిర్వహించిన వికలాంగుల సంకల్ప దీక్ష (నిరాహార దీక్ష) దిగ్విజయంగా ముగిసిందన్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద దీక్ష చేపట్టామని, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలిపారన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఆసరా పింఛను ప్రతి నెల 5వ తేదీ లోపు అందించాలని, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా కేటాయించాలని, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల అభ్యున్నతికి వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, వికలాంగులకు 35 కేజీల అంత్యోదయ కార్డు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ దీక్షకు సీపీఐ(ఎం) నాయకులు మాజీ ఎంపీ మీడియం బాబురావు, టిపిసిసి సభ్యులు పోట్ల నాగేశ్వరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, టిపిసిసి సభ్యులు ఎడవెల్లి కృష్ణ, బాలశౌరి, బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ పాషా, జన సమితి నాయకులు మల్లెల విశ్వనాథం, జనసేన నవతన్ కుమార్, తెలంగాణ రక్షణ సమితి నాయకులు నరాల సత్యనారాయణ, తుడుం దెబ్బ నాయకులు, మైనార్టీ జేఏసీ నాయకులు, సమాచారక్షణ చట్టం సభ్యులు, రమేష్ నాయక్, లగడపాటి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనేరు సత్యనారాయణ, నిరంజన్, మాల మహానాడు కూరపాటి రవీందర్, ప్రేమ్ మల్లెల ఉషారాణి, గడ్డం రాజశేఖర్, భూక్య రమేష్, అనిల్, వీరబాబు,బీసీ సంఘాలు నాయకులు కురుమిళ్ళ శంకర్, కిషోర్లు మద్దతు తెలిపారు.
వికలాంగుల పట్ల వివక్ష చూపిస్తే ప్రజందోలనతో బుద్ది చెబుతాం :మిడియం
వికలాంగుల పట్ల వివక్ష చూపిస్తే ప్రజందోలనతో బుద్ది చెబుతామని, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేదంటే ఆందోళనకు ప్రజా మద్దతు కూడగట్టి పోరాటం చేస్తామని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) నేత మీడియం బాబురావు అన్నారు. వారు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు భూక్యా రమేష్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జా సురేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.