Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భావి భారతానికి నిర్మాతలు విద్యార్థులేనని జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావు అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రెండో రోజు మంగళవారం స్థానిక జిల్లా గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తరగతి గదులలో నుండే మేధావులు పుట్టుకొస్తారని, విద్యార్థులు పుస్తకాలు చదవడం మరింతగా అలవాటు చేసుకుంటే జ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చని చెప్పారు. '' చినిగిన చొక్కా అయినా వేసుకో... కానీ ఒక మంచి పుస్తకాన్ని చదవటం మాత్రం మర్చిపోకు'' అని మేధావులు చెప్పారని, పుస్తకాలు చదువవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకను వెలికి తీసేందుకు గాను చిత్రలేఖన పోటీని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా కార్యదర్శి ఏ. మంజువాణి, సిబ్బంది ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 120 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని అందమైన చిత్రాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు యం.నవీన్ కుమార్, డి.వరలక్ష్మీ దేవి, జి.మణి మృధుల, కె.మధుబాబు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.