Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊర్లును కలిపే రహదారులు
- ఎమ్మెల్యే మెచ్చా కృషి ఫలం
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆర్భాటం, ప్రచారాలకు కాకుండా అభివృద్ధి కోసం పాటుపడే పాలకులు కొందరే ఉంటారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు రూపంలో ప్రజలు హృదయాల్లో ఉంటారు. ఈ చిత్రంలో దృశ్యాలు పట్టణము రోడ్ల కూడలిను తలపిస్తుంది కదూ...కానీ కానేకాదు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని మూడు గిరిజన పంచాయతీలను అనుసంధానం చేసే కూడలి. అశ్వారావుపేట చేరుకోవడానికి ఒకటి మద్ది కొండ (భీముని గూడెం) పంచాయతీ నుండి జమ్మిగూడెం మీదుగా రెండవది జమ్మిగూడెం నుండి గుర్రాల చెరువు మీదుగా, మూడోది నారంవారిగూడెం నుండి మొద్దులుగూడెం, జమ్మిగూడెం మీదుగా వెళ్ళే రహదారులు. ఈ రహదారికి ఇటీవలే ప్రధాన మంత్రి సడక్ రోజున (పీఎంఎస్‌వై) పధకం నిధులతో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్ధన మేరకు ఎంపీ నామా నాగేశ్వర ప్రతిపాదనలతో ఊట్లపల్లి నుండి మద్దికొండ-కేసప్పగూడెం నుండి మొద్దులుగూడెం రహదారి పేరుతో రూ.3 కోట్ల 24 లక్షల వ్యయంతో 5.1 కి.మీలు నిర్మించారు. ఈ రహదారితో ఒకే సారి మూడు గిరిజన పంచాయతీలు అనుసంధానం అయ్యాయి. ప్రస్తుతం గిరిజన సంక్షేమం నిధులతో ఆ శాఖ తరుఫున నియోజక వర్గంలో మరి కొన్ని రహదారులు మంజూరీతో పాటు నిధులను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాబట్టారు. దీంతో నియోజక వర్గంలో గ్రామీణ దారులకు మహర్దశ రానుంది. మెచ్చా నాగేశ్వరరావు చొరవతో నియోజకవర్గానికి రూ.17.83 కోట్లు మంజూరు.
అశ్వారావుపేట మండలంలో...
కొండ తోగు రోడ్డు మార్గం కోసం రూ.98 లక్షలు, జిల్లా పరిషత్ రోడ్డు నుంచి గంగారంకు రూ.70 లక్షలు, నారంవారిగూడెం నుంచి గుర్రాలచెరువుకు రూ.1.78 కోట్లు, రెడ్డిగూడెం నుంచి సుద్ద గోతుల గూడెంకు రూ.43 లక్షలు, దమ్మపేట మండలంలో....లింగాల పల్లి నుంచి బొజ్జం వారి గుంపుకు రూ.1.95 కోట్లు, చలమప్ప గూడెం నుంచి తొట్టిపంపు వయా మల్లమ్మ గుంపుకు రూ.1.40 కోట్లు, ములకలపల్లి మండలంలో....జగన్నాధపురం నుంచి తోగ్గూడెంకు రూ.2.85 కోట్లు, మంగలిగుట్ట నుంచి సుందరయ్య నగర్‌కు-రూ.1.06 కోట్లు, రాజుపేట నుంచి పాతగుండాలపాడుకు రూ.1.65 కోట్లు, జగన్నాధపురం నుంచి యర్రప్ప గుంపుకు రూ.46 లక్షలు, అన్నపురెడ్డిపల్లి మండలంలో..రంగాపురం నుంచి గుంపెనకు రూ.1.37 కోట్లు, చండ్రుగొండ మండలం... అయ్యన్నపాలెం నుంచి బలికుంటకు రూ.1.60 కోట్లు, వంకనంబర్ నుండి నల్లగండ్లబోడుకు రూ.1.60 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.