Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని మొండికుంట నివాసి అయిన పదిరావూరి శ్రీనివాసచారి ఇటీవల తను నమ్ముకున్న వాస్తు రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ అమెరికన్ యూనివర్సిటీ నుండి థాయిలాండ్ దేశంలో అక్కడి గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ తీసుకున్న శుభ సందర్భంగా మంగళవారం ఎంపీపీ ముత్తినేని సుజాత ఘనంగా సన్మానించి డాక్టరేట్ తీసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. మన ప్రాంతంలో వాస్తు విషయాలలో నిష్ణాతులైన వారు ఉండటం సంతోషించదగ్గ విషయం అన్నారు. వారు మరిన్ని పురస్కారాలను అందుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొండికుంట ఎంపీటీసీ కమటం నరేష్, మండల కోఆప్షన్ అధ్యక్షులు ఖదీర్, బీఆర్ఎస్ నాయకులు ముత్తినేని వాసు, బేజంకి రవి, నరేష్, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.