Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ అధికారుల ఆకృత్యాలు ఆపండి
నవతెలంగాణ-చర్ల
అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నుండి పోడు సాగులో ఉన్న గిరిజనులకు పోడు హక్కుపత్రాలు ఇవ్వాలని చట్టం చెపుతూ ఉంటే స్థానిక అటవీ అధికారులు అది పెడచెవిన పెట్టి మాపై జులూం చూపిస్తున్నారని సుబ్బంపేట పొడుసాగుదారులు ఎమ్మెల్యే పొదెం వీరయ్య, స్థానిక ఎంపీడీవోలకు మంగళవారం వినతి పత్రం అందించారు. 2005 నుండి 75 మంది గిరిజనులు సుబ్బంపేట అడవుల్లో సుమారు 50 ఎకరాల పోడుసాగు చేసుకొని పంట వెయ్యడానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మాయమాట చెప్పి అటవీ అధికారులు తమకు పోడు ఇవ్వకుండా నానావస్తులు పెడుతున్నారని పోడు సాగుదారులు ఎమ్మెల్యే ముందు వాపోయారు. పోడుకొట్టిన విస్తీర్ణం తక్కువగా ఉండడం పోడు సాగుదారులందరూ కలసి పంచుకుంటే కనీసం అరకరం కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అటు అధికారులను బతిమాలి, బామాలి వారితో సైక్యతగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పోడు సర్వేలో తమ తమ పోడు భూమిని అడవి అధికారులు సర్వే చేయడం లేదని పని మానుకొని తిరిగి తిరిగి శారీరకంగా, ఆర్థికంగా అలసిపోతున్నామని అటవి అధికారుల ఆకృత్యాలను నిలుపుదల చేయాలని వారు సీపీఐ(ఎం) నాయకత్వంలో మంగళవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించడం జరిగింది. సనుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భద్రాచలం ఐటిడిఏ పీఓతో మాట్లాడి తమ సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కారం నరేష్ రామారావు, సుబ్బం పేట సర్పంచ్ యాక సుజాత, జడ్పీటీసీ ఇర్పాశాంత, మందిని కోదండరామయ్య, లక్ష్మి, పెద్ద ఎత్తున పోడు సాగుదారులు పాల్గొన్నారు.