Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
హైదరాబాద్ ప్రగతి భవన్లో ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావును బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మణుగూరు జెడ్పీటీసీ పోశం నరసింహారావు, మణుగూరు మండల పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశమై అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి తదితర అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేపించి అభివృద్ధి చేస్తానని కాంతారావు పేర్కొన్నారు. మారు మూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణం సంబంధించి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా చెక్ డ్యామ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లు, సంబంధించి నిధులు కూడా మంజూరు అవుతున్నాయని ఆయన పార్టీ నాయకులకు తెలిపారు.