Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిర్స ముండా జయంతి సభలో మాజీ ఎంపీ మిడియం
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను అడవికి దూరం చేసి, కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పేరిట అడవిని అప్పచెప్పడానికి ఉన్న చట్టలకు తూట్లు పొడిచి అటవీ సంరక్షణ నియమాలను తీసుకవచ్చిందని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ నియమాలను చట్ట రూపంలో తీసుకరావడానికి చూస్తున్నారని తక్షణమే ఈ అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహారంచుకోవాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండలం కొమరం భీమ్ కాలనీలో మంగళవారం జరిగిన బీర్సా ముండా జయంతి సభ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్) జిల్లా కమిటీ సభ్యులు ముక్తి రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నియామాలు చట్ట రూపం దాల్చితే ముఖ్యంగా పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం, న్యాయమైన పరదర్శకమైనా పరిహారం పునరావాసం పొందే హక్కుల చట్టంలో పేర్కొన్న గిరిజన గ్రామ సభ నిర్ణయం ఉల్లంగించబడుతుంది అని అన్నారు. దేశంలో 11కోట్ల మంది గిరిజన తెగలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలు కాకుండా అడ్డంకులు కల్పిస్తుందని అన్నారు. 5వ, 6వ షెడ్యూలులో గిరిజనులు సాంప్రదాయపు భూముల నుండి అడవుల నుండి గెంటి వేయబడుతున్నారని అన్నారు. ఈ సభలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్) జిల్లా అధ్యక్షులు వజ్జా సురేష్, ముక్తి రామకృష్ణ, ఈసం రాంబాబు, మేకల కృష్ణ, మోకాల వెంకటేశ్వర్లు, జబ్బా సంధ్య, మెస్సు కోటమ్మ, పూజారి నాగమణి, కోరం కృష్ణారావు, కంగాల రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.