Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
- విలేకర్ల సమావేశంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు అర్హులైన దళితులకు అందకుండా పోతుందని, దళిత బంధుకు దళారిలు రాబంధులుగా ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్క దళితులకు దళిత బంధు అమలు చేయాలని, దళితులకు నాయ్యం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అన్నారు. మంగళవారం కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తీలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు అర్హులైన ఏ దళితుడికి చెందడం లేదని, మధ్య దళారులే మింగేస్తున్నారన్నారు. దళిత లబ్ధిదారులకు చేరేది 5 శాతం మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్త చేశారు. దళారులు ఒక యూనిట్ కి రూ.4 లక్షలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది దళిత లబ్ధిదారుల చేతులకు కనీసం రూ.5 లక్షలు కూడా చేరడం లేదన్నారు. దళారులు, బ్రోకర్లుపై సిబిసిఐడి, ఏసిబి దర్యాప్తు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, లక్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్, లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.