Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్వివర్గ సభ్యులు భూక్య వీరభద్రం
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా మున్సిపాలిటీ పరిధిలో పదో వార్డులో ప్రభుత్వ స్థలాలను తప్పుడుధ్రుపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. గండగలపాడు గ్రామంలో ఆక్రమణకు గురైన స్థలాలను వెలికి తీయాలని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కబ్జాదారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్ష రెండోవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా భుక్యా వీరభద్రం మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు మచ్చా మణి, మల్లేంపాటి రామారావు, చింతనిప్పు చలపతిరావు, గుమ్మా నర్సింహారావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహనరావు, బాజోజు రమణ, సీనియర్ నాయకులు వాసిరెడ్డి విద్యాసాగర్, సంక్రాంతి పురుషోత్తం, ఇమ్మడి సుధీర్, పల్లేబోయిన కష్ణ, కామినేని రవి, బెజవాడ వీరభద్రం, తోట కష్టవేణి, ఇసినెపల్లి నాగమణి, రుబెన్, పాపగంటి రాంబాబు, బొడ్డు నారాయణ, కిన్నెర మోతి, తాటి కష్ణకుమారి, చావ కళావతి, ఒర్సు సితారాములు, కిన్నెర కరుణాకర్, పూర్ణకంటి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.