Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస సామర్ధ్యాల పెంపుకు సూచనలు
నవతెలంగాణ-కారేపల్లి
మేకలతండా(గేటుకారేపల్లి) బాలిక ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ డిప్యూటీ డైరక్టర్ పూజారి కృష్ణనాయక్ గురువారం సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలోని ప్రతి తరగతి గదిని పరిశీలించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను పరీక్షించారు. పదోతరగతి విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులకు సూచనలు చేశారు. మెనూ తీరును అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారుచేసి విద్యార్ధులకు అందించిన సాధన పుస్తకాల వినియోగం, వాటి ఉపయోగం గురించి వివరించారు. కనీస సామార్ధ్యాల పెంపుకు సాధన పుస్తకం ఎంతో ఉపయోగమన్నారు. కిచన్ రూమ్, స్టోర్ రూమ్లను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజన తీరును ఆయన పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదోతగరతిలో 10 జీపీఏలు సాధనకు ప్రణాళికతో విద్యార్ధులను సిద్దం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వడిత్యా.నారాయణ, డిప్యూటీ వార్డెన్ ఏ.సుస్మిత, ఉపాధ్యాయులు ఇస్లావత్ హచ్యానాయక్, సేవాజీ సూర్య, భాస్కర్రావు, వసుధ, సుదర్శన్, చంద్రయ్య, మోహన్, మానస, ప్రమీల పాల్గొన్నారు.