Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు పార్టీ బీజేపీ
- కళ్యాణలక్ష్మి చెక్‌లు పంపిణి చేసిన ఎమ్మెల్యే రాములునాయక్
నవతెలంగాణ-కారేపల్లి
ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తపనపడుతున్నారన్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. గురువారం కారేపల్లి మండలంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్‌లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాశీర్వాదంతో అనేక పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకవ చ్చారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలులో పారదర్శకత పాటించటానికి స్ధానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కొనుగోలు పార్టీ అని, దానికి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చటం తప్ప ప్రజలు బాగోగులు పట్టవన్నారు. బీజేపి బావోద్వేగాలు రెచ్చగొట్టె పార్టీ అని, బువ్వ పెట్టే పార్టీ టీఆర్ఎస్ అని కొనియాడారు. సీపీఐ(ఎం), సీపీఐ తమ మిత్రులేనని రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కొట్లాటాలతో కనుమరుగవుతుందన్నారు. కారేపల్లి మండలంలో ఇప్పటి వరకు 1919 మంది లభ్ధిదారులకు రూ.19.18 కోట్లు కళ్యాణలక్ష్మి, షాధీముబారక్ చెక్‌లు అందజేయటం జరిగిందన్నారు. అనంతరం 37 మంది కళ్యాణ లక్ష్మి లభ్దిదారులకు రూ. 37.40 లక్షలు, 10 మంది బాధితులకు రూ. 3లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్‌లను పంపిణి చేశారు. అంతకు ముందు శస్త్ర చికిత్స చేయించుకున్న భాగ్యనగర్‌తండా ఎంపీటీసీ అలోత్ ఈశ్వరీనందరాజ్ను పరామర్శించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, రైతు బంధు మండల కోఆర్డినేటర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, న్యాయవాధి నర్సింగ్ శ్రీనివాసరావు, సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు భూక్యా రంగారావు, ఆదెర్ల స్రవంతి, మాలోత్ కిషోర్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు దారావత్ పాండ్యానాయక్, ఇమ్మడి రమాదేవి, జడల వసంత, పెద్దబోయిన ఉమాశంకర్, అనిఫ్, దిశ కమిటీ జిల్లా సభ్యులు బానోత్ కుమార్, ఆర్ఐలు నర్సింహరావు, భానుప్రసాద్, సోసైటీ డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోషయ్య, డేగల ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు తోటకూరి పిచ్చయ్య, ఇమ్మడి తిరుపతిరావు, పప్పుల నిర్మల, ఎర్రబెల్లి రఘు, మజీద్పాష. కోటి, వీరన్న(చక్రం) తదితరులు పాల్గొన్నారు.