Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదిరేలా భారీ ప్రదర్శన, మోటారుసైకిల్ ర్యాలీ
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- టీఆర్ఎస్ ఐక్యతకు సత్తుపల్లి వేదిక కానుంది
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
నవతెలంగాణ- సత్తుపల్లి
ఎంపీలుగా ఎన్నికయ్యాక సత్తుపల్లి నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లకు నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుదామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలలో ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదనరావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎంపీలకు అభినందన సభతో పాటు జిల్లాపై అభిమానం చూపించి ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత సభను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సండ్ర కోరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదనరావు మాట్లాడుతూ ఈ అభినందన సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జిల్లాకు ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా చేశారన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఐక్యంగా ఉన్నారనడానికి సత్తుపల్లి సభ వేదిక కానుందని తాతా మధు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మాజీ ఛైర్మెర్ ఖమర్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిపు కృష్ణచైతన్య, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, నాయకులు వల్లభనేని పవన్, నడ్డి ఆనందరావు, వేములపల్లి మధు, కృష్ణారావు పాల్గొన్నారు.
15వేలకు పైగా జనసమీకరణతో భారీ ప్రదర్శన...
5వేలకు తగ్గకుండా మోటారుసైకిల్ భారీ ర్యాలీ
ఎంపీలు బండి, వద్దిరాజు తొలిసారిగా సత్తుపల్లి వస్తున్న సందర్భంగా 15వేల మందికి పైగా జనసమీకరణతో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా స్వాగత ప్రదర్శన చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు సుమారు 5వేలకు తగ్గకుండా మోటారు సైకిళ్లను ర్యాలీలో ఉండేలా టీఆర్ఎస్ శ్రేణులు విశేష కృషి జరపాలన్నారు. ఈ అభినందన, కృతజ్ఞత సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
తల్లాడ మండలం నారాయణపురం
నుంచి స్వాగతం ప్రదర్శన ప్రారంభం
నియోజకవర్గంలోని తల్లాడ మండలం నారాయణపురం జీఎన్ఆర్ గార్డెన్ నుంచి మధ్యాహ్నం 1:00 గంటకు ఎంపీలు బండి, వద్దిరాజులకు స్వాగత నీరాజనాల కార్యక్రమం మొదలవుతుందని సండ్ర తెలిపారు. అక్కడి నుంచి తల్లాడ రింగుసెంటరు వరకు రోడ్‌షో, సభ ఉంటుందన్నారు. 2:00 గంటలకు కల్లూరు శివారు నుంచి సెంటరు రోడ్ షో, సభ జరుగుతుందన్నారు. 3గంటలకు పెనుబల్లి మండలం శివారు నుంచి ఘనస్వాగతం పలుకుతూ వీఎంబంజర వరకు రోడ్ షో, అనంతరం సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం అక్కడి నుంచి సత్తుపల్లి వరకు మోటారుసైకిళ్లతో భారీ ర్యాలీ ఉంటుందన్నారు.
4గంటలకు సత్తుపల్లిలో అభినందన, కృతజ్ఞత సభ
తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల కార్యక్రమాల అనంతరం సత్తుపల్లి శివారు వెంగళరావునగర్ నుంచి స్వాగత భారీ ప్రదర్శన, మోటారుసైకిళ్ల ర్యాలీ మొదలవుతుందన్నారు. ఈ ప్రదర్శన సత్తుపల్లిలోని పాతసెంటరు వరకు, అక్కడి నుంచి జేవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకుంటుందని, 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గిడ్డంగుల సంస్థల ఛైర్మెన్, కళాకారుడు సాయిచంద్చే ధూంధాం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సభకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, విప్ రేగా కాంతారావు, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరరెడ్డి, మాజీమంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు పాల్గొంటారని సండ్ర తెలిపారు. అనంతరం జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటవుతున్న సభా వేదికను ఎమ్మెల్యే సండ్ర తాతా మధుతో కలిసి పరిశీలించారు.