Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆది మోహన్ రావు...
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
కార్మిక సమస్యల పరిష్కారం కొరకు కార్మిక ఉద్యమాల దిక్సూచిగా నేడు సిఐటియు నిలబడిందని భద్రాచలం ప్రముఖ వైద్యులు శ్రీనివాస నర్సింగ్ హౌమ్ అధినేత డాక్టర్ ఆది మోహన్ రావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు మూడో మహాసభ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ మోహన్ రావు మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కేటీపీఎస్ బీటీపీఎస్ ఐటిసి వంటి పారిశ్రామిక కేంద్రాలతో ఒక పారిశ్రామిక జిల్లాగా ఉన్నదని అన్నారు. రాష్ట్రంలోనే కాక దేశ నలుమూలల నుంచి అనేక మంది కార్మికులు జీవనోపాధి కోసం ఈ జిల్లాకి వస్తున్నారని అభిప్రాయపడ్డారు. అటువంటి సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సిఐటియు అనేక రకాల పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. ఇంతటి ప్రాధాన్యగల సిఐటియు జిల్లా మూడో మహాసభలకు తనని అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సిఐటియు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.