Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-పాల్వంచ
రిలయన్స్ యజమాని ముఖేష్ అంబానీ సెలూన్ రంగంలోకి వచ్చి నాయి బ్రాహ్మణుల పొట్టకొడుతున్నారని నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తూమల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పాల్వంచలోని కేటీపీఎస్ బీసీ అసోసియేషన్ హాల్లో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఐక్యమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈనెల 22న జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా మహాసభ విజయవంతం చేయాలన్నారు. గౌరవ అధ్యక్షులు రవీందర్, ప్రెసిడెంట్ శ్రీరాములు ఉదరు, సెక్రెటరీ హరికృష్ణ, కోశాధికారి సోములవెల్లి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు పుల్లారావు, జరుపల వెంకన్న, రమేష్, దేవరకొండ శ్రీను, రాజు రాంప్రసాద్, రమేష్, మురళీకృష్ణ, శ్రీను, నాగరాజు, రామకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.