Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
విప్లవకారుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా ఊరూరా జెండా దినోత్సవం నిర్వహించాలనే అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎంఎస్) ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.పుల్లయ్య, సీనియర్ నాయకులు ఊకే వీరాస్వామిలు స్థానిక ప్రజాసంఘాలు కార్యాలయం ప్రాంగణంలో సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బ్రిటీష్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆదివాసీ వీరుడిని సంస్మరణ దినోత్సవం సందర్భంగా లక్షకు పైగా గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగుర వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తగరం జగన్నాధం, సత్యనారాయణ, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.