Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీది కార్పొరేట్ భక్తి
- సమస్యలపై పోరాటాలకు సిద్ధం కండి
- జిల్లా మహాసభ ప్రారంభ సభలో సీఐటీయూ జాతీయ నేత ఎం.సాయిబాబు
నవతెలంగాణ-భద్రాచలం
సంపద సృష్టికర్తలు కార్మికులేనని, కార్పొరేట్ అనుకూల విధానాల అనుసరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు సామాన్య ప్రజానీకాన్ని కలుపుకొని సమరసిల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయి బాబు పిలుపునిచ్చారు. భద్రాచలంలో గురువారం సీఐటీయూ జిల్లా మూడో మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందని, అదే స్థాయిలో కార్మిక వర్గం ప్రతిఘటన ఉద్యమాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న అన్ని పోరాటాలను సమన్వయపరిచి సంఘటితం చేయాలని ఆ పోరాటాలకు కార్మిక వర్గ నాయకత్వం సమరశీలత కీలకంగా మారాలని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తూ ప్రజాస్వామిక హక్కుల పైన దాడి చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థలను కార్మిక హక్కులను ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన దేశ విభజనకు బీజేపీ కుట్రలు చేస్తుందని విమ ర్శించారు. దేశ సంపదను మొత్తం స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ పైకి మాత్రం దేశభక్తిగీతమై నటువంటి మాటలు మాట్లాడుతుందని విమర్శించారు. మాటల్లో దేశభక్తి చేతల్లో కార్పొరేట్ భక్తిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రదర్శిస్తుందని ఎం.సాయి బాబు విమర్శించారు. దేశ సంపద కోసం దేశ ప్రగతి కోసం తమ శ్రమను ధార పోస్తున్న కార్మిక వర్గమే నిజమైన దేశభక్తులను పేర్కొన్నారు. దేశానికి బీజేపీ వినాశకర విధానాల నుండి విముక్తి కల్పించాల్సిన బాధ్యత కార్మికులకు ఉద్యమాలపై ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన సమస్యల ఉద్యమాలకు సీఐటీయూ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. కార్మిక వర్గ పోరాటాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను వ్యవసాయ కార్మికులను అసంఘటిత కార్మికులను కలుపుకొని బలమైన ఐక్య పోరాటాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది
కార్మిక ఉద్యమాలే
దేశంలో ప్రమా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్మిక ఉద్యమాలపై ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.ఎల్. కాంతారావు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా మహాసభల ప్రారంభ కార్య క్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్ర పోరా టంలో కార్మికుల నాయకులు, కార్మికులు అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. త్యాగాల ఫలితంగా వచ్చిన స్వా తంత్ర ఫలాలను ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాలని అందుకోసం సీఐటీయూ నిర్వహిస్తున్న పోరాటాలకు భద్రాద్రి ప్రజలు అన్నివేళలా అండగా ఉంటారని పేర్కొన్నారు.
- ప్రముఖ వైద్యులు ఎస్ఎల్ కాంతారావు