Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఏఆర్ఎం జాతీయ చైర్మెన్, మాజీ ఎంపీ మిడియం బాబురావు
- ఐటీడీఏ ఏవోకి వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సర్వే చేస్తున్నారు, ఈ సర్వేలో ఆదివాసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సర్వే జరుగుతున్న కొన్ని పోడు భూమి కేంద్రాల్లో సర్వే చేయడం లేదని, వాటికి కూడా సర్వే నిర్వహించాలని ఏఏఆర్ఎం జాతీయ చైర్మన్ మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు అన్నారు. గురువారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌కు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ జిల్లాలో సర్వే పోడు భూమి కేంద్రాలలో పూర్తి స్థాయిలో జరగడం లేదని, పోడు భూమి సర్వే నామమాత్రేంగే జరుగుతుందని ఈ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సర్వేని పూర్తిస్థాయిలో చేయడం లేదని విమర్శించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ములకలపల్లి మండలంలో మాదారం, పాలవాగు, కొత్తూరు, మామిళ్లగూడెం, ఒడ్డు రామవరం గ్రామాలలో ఉన్నటువంటి కేంద్రాలలో పోడు సాగుదారులు సాగులో ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కావాలని సర్వే చేయడం లేదన్నారు. అలాగే అశ్వారావుపేట మండలంలో ఉన్న ఆసుపాక, బండారు గుంపు అశ్వరావుపేట ఫారెస్ట్ రేంజ్లో ఉన్న పోడు కేంద్రాలలో కూడా సర్వే చేయడం లేదన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25వ తారీకు లోపు సర్వే పూర్తి చేయాలలని అన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు సర్వేలు చేయడం లేదని ఆరోపించారు. పోడు సాగుదారులు భూమికి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రసీదులు కూడా ఉన్నవి అయినా ఫారెస్ట్ అధికారులు సర్వే చేయడం లేదు అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో సర్వే చేయని పోడు భూములు 614 ఎకరాలు, దరఖాస్తు దారులు 230 మంది ఉన్నారు. ఈ కేంద్రాలలో పూర్తిస్థాయిలో సర్వే జరిపించి తక్షణమే అటవీ హక్కుల పట్టాలు ఇవ్వనిచో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏవో మాట్లాడుతూ వెంటనే ఐటీడీఏ పీవోకి, అలాగే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, జిల్లా నాయకులు గౌరీ నాగేశ్వరరావు, సోయం జోగారావు, మడకం సతీష్, గోపాలరావు శ్రావణ్, రావుజా తదితర నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.