Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరుకు సందే తరగతి గది
- చెప్పనలవి కాని గురుకులం విద్యార్ధుల వెతలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఒక దృశ్యం వంద కావ్యాలకు రూపం ఇస్తుందని మన సాహితీ వేత్తలు చెప్తారు. ఈ చిత్రం మన ప్రభుత్వ అరకొర వసతుల విద్యావ్యవస్థ కే మంచి ఉదాహరణగా నిలుస్తుంది. గురుకుల పాఠశాల అంటే విశాలమైన మైదానంలో, చెట్టూ చేమ కలిగిన హరిత వాతావరణంలో, ఆటా పాటలతో ఆహ్లాదం పంచేలా గురువులు-శిష్యులు విరాజిల్లే సామాజిక చైతన్యవంతం అయ్యే ఆలయం. అయితే మన ప్రభుత్వాలు పాఠశాలలు మంజూరు చేస్తారు. కానీ ఆ వాతావరణం కల్పించే భవనం సమకూర్చేందుకు చర్యలు చేపట్టరు. దీంతో గురుకులం అనే పదానికే అర్ధం మారిపోయి ఈ విద్యావిధానం లక్ష్యం నీరు కారుతుంది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గుర్రాల చెరువు వెళ్ళే మార్గం అద్దె భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిభాయి ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్ధుల వెతలు చెప్పనలవి కానివి. ఈ పాఠశాల 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. చాలీ చాలని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇందులో 5 నుండి పది తరగతులలో మొత్తం 200 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి పాఠశాల నిమిత్తం 10 తరగతి గదులు, కార్యాలయం, సిబ్బందికి కలిపి మరో రెండు గదులుతో ఒక భవనం, వసతి, వంటావార్పు కోసం మరో 10 గదులు భవనం, విశాలం అయిన క్రీడా మైదానంలో కూడిన ప్రాంగణం ఉండాలి. ప్రస్తుతం చాలీ చాలని గదుల్లో చదవడం, రాత్రి నిద్రించడం, తినడం అన్నీ గదుల్లోనే వెళ్ళ దీస్తున్నారు. ఈ చిత్రంలో అదే పాఠశాలకు చెందిన విద్యార్ధులు చిన్నపాటి సందులో, కదలడానికి సైతం వీలు లేని స్థితిలో కూర్చున్న సందర్భంగా నవతెలంగాణ గురువారం సందర్శించిన సమయంలో ఆ విద్యార్ధులు దుస్థితి. ఈ పాఠశాల తరుచు వివాదాలకు నింగి మారింది. ఆ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆ చూపులు సందర్శకుల హృదయాన్ని దహించి వేస్తుంది.