Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురగిరి క్షత్రియ సంఘంకు రూ.లక్ష విరాళం ప్రకటించిన శ్రీరామ్ హాస్పిటల్ చైర్మెన్
నవతెలంగాణ-పినపాక
పురగిరి క్షత్రియ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అంకతి ఉమామహేశ్వర రావుకు పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో గల శ్రీరామ్ హాస్పిటల్ వద్ద శ్రీరామ్ హాస్పిటల్ చైర్మన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. భద్రాచలంలో నూతనంగా సుమారు నాలుగు కోట్ల వ్యయం నూతనంగా నిర్మిస్తున్న పురగిరి క్షత్రియ సంఘం భవన నిర్మాణం కోసం శ్రీరామ్ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీరామ్ రూ.లక్ష ప్రకటించారు. ఆయనతోపాటు పూజారి వెంకన్న రూ.లక్ష విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.