Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి
నవతెలంగాణ-కొత్తగూడెం
గరికపాటి నర్సింహారావు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ఆఫీసు సమావేశం ఎస్.రాజమ్మ అధ్యక్షతన మంచి కంటిభవన్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి మాట్లాడుతూ గరికపాటి అనుచిత వ్యాఖ్యలను ఐద్వా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల కట్టు, బొట్టు విషయాలపై కామెంట్లు చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లేకపోతే శిక్ష అర్హులని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్ సభ్యులు ఎస్. లక్ష్మి, ఎన్.లీలావతి డి.లక్ష్మి, వి.వాణి, అమల తదితరులు పాల్గొన్నారు.