Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జన విజ్ఞాన వేదిక వారు నిర్వహించిన ''చెకుముకి మండల స్థాయి పరీక్ష-2022'' నందు లక్ష్మీదేవిపల్లిలో త్రివేణి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనగా త్రివేణి పాఠశాల విద్యార్థులు ఎల్.విశృత్, కె.నేహాసంజన, ఆర్.శ్రద్ధ, తమ ప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని బహుమతిని సాధించారని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి జగదీశ్, సీఆర్ఓ కె.మురళీ కృష్ణ, ప్రిన్సిపల్స్ వైవి. సురేష్, శ్రీనివాస్ సింగ్‌లు పాల్గొన్నారు.