Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
చెకుముకి పోటీలలో గెలు పొందిన విద్యార్థులకు మంగళ వారం బహుమతులు పంపిణీ చేసారు. ఈ నెల 18న చెకుముకి ఆధ్వర్యంలో నిర్వహిం చిన పోటీ పరీక్షలో మండలంలో 8, 9,10, తరగతులు చదువు తున్న ప్రభుత్వం, ప్రయివేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థు లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ చేసారు. 7 వేలు విలువైన బహుమతులను మొత్తం 27 ప్రైజులు తోపాటు పాల్గొన్న అందరికీ పరీక్ష ప్యాడ్లు అందజేశారు. మొదటి బహుమతి ఇంగ్లీషు మీడియం నుంచి బాలిక ఉన్నత పాఠశాల కల్లూరు, తెలుగు మీడియం ప్రభుత్వం పాఠశాల కల్లూరు, ప్రైవేట్ పాఠశాల నుండి ఇంగ్లీషు మీడియం నుండి బాలాజీ హై స్కూల్ కల్లూరు, వారు మూడు పాఠశాల విద్యార్థుల మొదటి ప్రైజు గెలుచుకున్నారు. వారికి కల్లూరు మండలం చెకుముకి టీమ్ తరపున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రదాన కార్యదర్శి దార. సురేష్ మాట్లాడుతూ జిల్లాలో కూడా కల్లూరు నుండి మొదటి ప్రైజు గెలిచిన ముగ్గురు విద్యార్థులకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు బహుమతులు ప్రకటించారు. బాలికల ఉన్నత పాఠశాలలో జనవరి 26 ఆటల పోటీలకు 9 ఆటలలో మొదటి 9 ప్రైజులు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనదుర్గ, కల్లూరు మండల లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దారా సురేష్, కల్లూరు ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు పసుమర్తి రాంబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు పోపూరి కృష్ణ, కొండపల్లి జానకి రామ శర్మ, చెకుముకి నిర్వాహకులు శర్మ, సుధీర్, బి.రాంబాబు, యుటిఎఫ్ జిల్లా ఇంచార్జీ ఎస్.సతీష్, యుటిఎఫ్ మండల అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి విజరు, చెన్నూరు కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులు కృష్ణమోహన్, సిఆర్పి కృష్ణయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.