Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో జనవరి 6 నుండి 9 వరకు నిర్వహణ
- సంఘం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి పిలుపు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేరళలోని త్రివేండ్రంలో జనవరి 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం మెరుగు రమణ అధ్యక్షతన మంగళవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించారు. భారతి మాట్లాడుతూ...ప్రవచనాల పేరుతో మహిళలపై గరికపాటి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. సమాజంలో తరతరాలుగా లింగ వివక్ష, అసమానత కొనసాగుతోందన్నారు. దానిని ఇంకా పెంచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. మహిళలకు గరికపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారాలు మోపుతున్నారని అన్నారు. అదేసమయంలో సంపన్నులకు కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ, సభ్యులు మేహరున్నిసాబేగం, నాగసులోచన, పి. ప్రభావతి, నాగమణి, లక్ష్మి, ఎం. పద్మ, బేబీ, కరుణ, అజిత, కుమారి, రమ, షైనాబి, ఫరీదా, సునీత, సుమతి, సుగుణమ్మ, సౌభాగ్య, తదితరులు పాల్గొన్నారు.