Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండల మహిళా సమాఖ్య (ఐకేపీ) ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని సదాశివునిపాలెం, రామానగరం, కిష్టారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాలను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దొడ్డా హైమవతిశంకరరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఆధ్వర్యంలో సమాఖ్య బాధ్యులు, ఐకేపీ సిబ్బంది ప్రారంభించారు. సదాశివునిపాలెంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ తుంబూరు సరస్వతి, రైతులు దామోదరరెడ్డి, వి.మోహనరెడ్డి, రాఘవరెడ్డి, నాగబాబు, క్షత్రియ గోపాల్‌సింగ్, లక్ష్మారెడ్డి, చెన్నాప్రసగడ వెంకటేశ్వరరావు, సంధ్యారాణి పాల్గొన్నారు. రామా నగరంలో సర్పంచ్ వేల్పుల కళావతి, ఎంపీటీసీ నాగచంద్రమోహనరావు, ఉప సర్పంచ్ మోటపోతుల పుష్ప, రైతులు నరసింహారావు, సత్యనారాయణ, పుల్లయ్య, కృష్ణమోహన్, శేషగిరి, బాషా, కమిటీ సభ్యులు కృష్ణవేణి, లత, కోటమ్మ, సంపూర్ణ, కృష్ణమ్మ, సత్యవతి పాల్గొన్నారు. కిష్టారంలో ఎంపీటీసీ సభ్యురాలు పాలకుర్తి సునీతారాజు, ఉప సర్పంచ్ కొలపనేని ధనుంజయరావు, రైతులు కొడిమెల అప్పారావు, జవ్వాజి అప్పారావు, మాచినేని నాగేశ్వరరావు, నరుకుళ్ల హరిబాబు, దేవినేని సత్య నారాయణ, కమిటీ సభ్యులు గండ్ర కుఋష్ణకుమారి, వేల్పుల వెంకటరమణ, రాజేశ్వరరి, రాణి, మరియమ్మ, విజయలక్ష్మీ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఏపీఎం కేవీ సుబ్బారావు, ఏఈవోలు వాసంతి, నిషా, నరేశ్, సీసీ నరేందర్, వీఏవోలు పాల్గొన్నారు.
తల్లాడ : రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తల్లాడ సొసైటీ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, సొసైటీ చైర్మన్ ఆర్. వీర మోహన్ రెడ్డి, డీసీఎంహెచ్ చైర్మన్ ఆర్వి శేషగిరిరావు, జడ్పిటిసి సభ్యురాలు ప్రమీల, డిఆర్డిఏపిడి విద్యా చందన, తాసిల్దార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగిం చుకోవాలని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుంచపర్తి చిన్న మల్లెల, రామన్నపాలెం, అడసర్లపాడు గ్రామాలలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఏపీఎం బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మారోజు సుమలత సురేష్, సర్పంచులు ప్రేమలత, నాగులమీరా, సుధాకర్, వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ పుచ్చకాయల లక్ష్మి, శంకర్ రెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు రమణ, సీసీలు నాగ చెన్నారావు, తులసితోపాటు సీసీలు రైతులు పాల్గొన్నారు.