Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు స్టేషన్ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యుల ధర్నా
నవతెలంగాణ-కొణిజర్ల
న్యాయం చేయండి అంటూ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.. ఇందుకు సంబంధించిన వివరాలు మండల పరిధిలోని దిద్దిపూడి గ్రామానికి చెందిన లింగాల హర్షిత మహబూబాబాద్ జిల్లా తోర్రుర్లోని సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ గురుకులంలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకొని చిన్నపాపను దత్తతకు తీసుకొని ఆమె వైరా టీచర్స్ కాలనీలో నివాసం ఉంటూ ప్రతిరోజూ మహబూబాబాద్ వెళ్లి వస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఈనెల ఏడోవ తేదీన అనుమానస్పద స్థితిలో తన ఇంట్లో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు దిద్దిపూడి గ్రామానికి చెందిన మక్కెల నరసింహరావు అతని భార్య నర్సమ్మ, వీరన్నలు కలిసి తన చెల్లెలు హర్షితను కొట్టి చంపారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా పోలీసులు విచారణ సరిగ్గా చేయడం లేదని మంగళవారం పోలీసు స్టేషన్ ఎదుట హర్షిత కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా హర్షిత అన్న లింగాల భాస్కరరావు మాట్లాడుతూ హత్యచేసిన నిందితులు దర్జాగా తిరుగుతున్నారని, తమకు న్యాయం చేయకుండా దోషుల పక్షాన పోలీసులు నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ టి యయాతి రాజ్ మాట్లాడుతూ హర్షిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చి ఇచ్చిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఆధారాలు సేకరిస్తున్నామని, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని, వచ్చిన తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు.