Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎర్రుపాలెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలం చెందాయని, కార్మిక హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల విఠల్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం స్వర్గీయ కామ్రేడ్ పెరుమాళ్ళ వెంకట రామయ్య నగర్ నందు సిఐటియు ఆరవ మండల మహాసభలను ఘనంగా నిర్వహించారు. మహా సభల ప్రారంభ సూచకంగా సిఐటియు జెండాను అంగ న్వాడి నాయకురాలు మేరీ జ్యోతి ఆవిష్క రించారు. పెరుమాళ్ళ వెంకట రామయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
మండల సిఐటియు నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
మండల సిఐటియు కన్వీనర్‌గా సగుర్తి సంజీవరావు, కమిటీ సభ్యులుగా కృష్ణకుమారి, మాధవి, కళావతి, సుధా, మరియమ్మ, సరోజిని, ఈసం శ్రీనివాస రావు, చిత్తారు కిషోర్, దూదిగం శ్రీనివాసరావుని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శీలం నరసింహారావు, సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బేతి శ్రీనివాసరావు, నాయకులు మేరీకాంతం, నిర్మల, విజయ, రమణ, జమలమ్మ, సుబ్బారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, షేక్ మాబు, చిన్న, తదితరులు పాల్గొన్నారు.