Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సై తేజావత్ కవిత
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ పోలీస్ శాఖ, ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ లింగమనేని నళినిశ్రీ అధ్యక్షతన మంగళవారం యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సుకు బోనకల్ ఎస్సై తేజావత్ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ ర్యాగింగ్ వలన కలిగే దుష్ప రిణామాలు, చట్టపరమైన శిక్షలు గురించి వివరించారు. విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, ఆన్లైన్లో అపరిచితుల ద్వారా జరిగే వేధింపులు, సైబర్ క్రైమ్ గురించి వివరించారు. వీటికి గురైన విద్యార్థులు ఎవరైనా తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. తల్లిదండ్రులు అనేక కష్టాలను భరిస్తూ విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తున్నారని వారి నమ్మకాలను వమ్ము చేయకుండా కష్టపడు చదువుకొని తల్లిదం డ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్‌లకు పాలు పడకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉద్యోగులు, కళాశాల ఎస్ఎస్ఎస్ పిఓ రామకృష్ణ, అధ్యాపకులు జోనాథన్ బాబు, ప్రసాద్ బాబు, శ్రీనివాసరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.