Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దళితబంధు మిగులు యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో దళితబంధు కోర్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంజూరు యూనిట్ల వంద శాతం గ్రౌండింగ్ కు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలకు 483 యూనిట్లు మంజూరు కాగా, 475 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు, 6 రవాణా యూనిట్లు, 2 డెయిరీ యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉందని అన్నారు. చింతకాని మండలంలో 3462 లబ్ధిదారులకు గాను 2648 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని, మిగులు యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 472 డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ చేయాల్సి ఉందని, రవాణా ఆంక్షల దృష్ట్యా ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పశువులకు వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ ఎప్పటికప్పుడూ ఆన్లైన్ అప్డేట్ పూర్తి చేయాలన్నారు. గ్రౌండింగ్ అయిన యూనిట్లను అధికారులు పర్యవేక్షణ చేయాలని, లబ్ధిదారులకు తగు సూచనలు, సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ప్రత్యేక అధికారులు క్రియాశీలకంగా వుండి, గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జెడ్పి సిఇఓ అప్పారావు, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, డిఆర్డీఓ విద్యాచందన, ఎల్జిఎం శ్రీనివాస రెడ్డి, జిఎం ఇండిస్టీస్ అజరు కుమార్, చింతకాని ఎంపిడివో శ్రీనివాసరావు, డిపిఎం దగ్గయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.