Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
మండల పరిధిలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పై హరితహారంలో నాటిన మొక్కలను జిల్లా పరిషత్ సీఈవో వింజం వెంకట అప్పారావు మంగళవారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కాలువలపై నాటిన మొక్కల సంరక్షణపై విమర్శలు రావడంతో పరిశీలించారు. చిరునోముల, ముష్టికుంట్ల గ్రామాలలో కాలవలపై నాటిన మొక్కలను ఆయన స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనకల్ మండలంలో సాగర కాలువలపై నాటిన మొక్కలు పెద్దవి కావటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో బడేపూడి వేణుమాధవ్, ఎంపీఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బంధం అర్జున్ నల్లబెల్లి రఘు, ఈజీఎస్ ఏపిఓ బసవోజు కృష్ణకుమారి, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.