Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
డిసెంబర్ 29, 30, 31 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు ఖమ్మం నగరంలో జరుగు తున్నాయని, ఆ మహా సభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మంరూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ తమ్మినేని సుబ్బయ్య భవన్లో పాలేరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ మహాసభలలో 29న జరిగే భారీ ర్యాలీలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలలో సెమినార్లు జరపాలని, గ్రూపు మీటింగులు జరపాలని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీర్, గుడవర్తి నాగేశ్వరరావు, కొమ్ము శ్రీను, ఊరడి సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు ఏటుకూరి రామారావు, రచ్చ నరసింహారావు, పొన్నెకంటి సంగయ్య, తోటపెద్ద వెంకటరెడ్డి, అంగిరేకుల నరసయ్య, మల్లెల హన్మతరావు, కె.వి.రెడ్డి, దుగ్గి వెంకటేశ్వర్లు, బిక్కసాని గంగాధర్, తాళ్లూరి వెంకటేశ్వర్లు ,పెండ్యాల సుమతి, గన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.