Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం
నవతెలంగాణ - ఎర్రుపాలెం
బిజెపి ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ, ఎన్నికలలో పబ్బం కడుపుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాల రాస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. భీమవరం గ్రామంలో పార్టీ నాయకులు కామ్రేడ్ స్వర్గీయ గొల్లపూడి రాజారావు రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన మైన నివాళులు అర్పించారు. రైతు సంఘం మండల నాయకులు గొల్లపూడి కోటేశ్వరరావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొన్నం మాట్లాడుతూ దేశంలో బిజెపి విచక్షణా రహితంగా ఈడి దాడులతో ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లపై దాడులు చేపిస్తూ భయాందోళనకు గురి చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికలలో కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బల పడకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు సిపిఎం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని హెచ్చరించారు. పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య మాట్లాడుతూ భీమవరం గ్రామంలో ఎర్ర జెండాకు పూర్వ వైభవం తేవాలని, అప్పుడే గొల్లపూడి రాజారావుకు మన మిచ్చే ఘనమైన నివాళులని అన్నారు. సమావేశంలో కృష్ణా జిల్లా గంపలగూడెం మండల రైతు సంఘం అధ్యక్షులు చెరుకు వీరారెడ్డి, బోనకల్ మండల కమిటీ సభ్యులు లక్ష్మణరావు, మండల కమిటీ సభ్యులు సగుర్తి సంజీవరావు, బేతి శ్రీనివాసరావు, మేడగాని తిరుపతిరావు, నాగులవంచ వెంకట్రామయ్య, నల్లబోతు హనుమంతరావు, అనుమోలు వెంకటేశ్వరరావు, వెంకట నారాయణరెడ్డి, మోహన్రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు సంక్రాంతి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం శ్రీనివాసరెడ్డి, అనుమోలు వెంకట కృష్ణారావు, టిడిపి నాయకులు జగన్, అయ్యవారిగూడెం సొసైటీ సభ్యులు గొల్లపూడి శ్రీహరి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు రామిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.