Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ - బోనకల్
మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కది పోస్ట్‌మ్యాన్ పాత్ర మాత్రమేనని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల పరిధిలోని ముష్టికుంట గ్రామంలో కాంగ్రెస్ నుంచి పలువురు బిఆర్ఎస్లో శుక్రవారం రాత్రి కమల్‌రాజు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు తెచ్చింది, ఇచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళిత బంధు పథకాన్ని పోస్ట్‌మ్యాన్ వచ్చిన ఉత్తరాన్ని ఇంటింటికి తిరిగి ఎలా పంపిణీ చేస్తారో అదే తరహాలో మధిర ఎమ్మెల్యేగా మల్లు భట్టి విక్రమార్క పోషిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం దళితబంధును ఎమ్మెల్యే భట్టి రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా మధిరకు భట్టి చేసింది శూన్యమని, వచ్చే ఎన్నికల్లో మధిరలో గులాబీ జెండా ఎగరవేస్తాం అని అన్నారు. మధిరలో కూడా బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో ముష్టికుంట్ల సర్పంచ్ షేక్ బిజాన్ బి, రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, మాజీ జెడ్పిటిసి బనావత్ కొండ, కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు కాకాని శ్రీనివాసరావు, ఎనగండ్ల మురళి, షేక్ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.