Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ - 2023 లో భాగంగా ఈ నెల 26, 27 తిరిగి డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ లో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి బూతు స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతి యువతీ, యువకులను గుర్తించి గరుడ ఆప్ లేదా ఫారం 6 ద్వారా ఓటరు గా నమోదు చేయాలన్నారు. ఇందుకు గాను బీఏల్ లు ఇంటింటికి తిరిగి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించాలని అన్నారు. 1 అక్టోబర్, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు అంటే ఇంటర్ రెండో సంవత్సరం, ఆపై చదివే వారు ముందస్తుగానే దగ్గరలోని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఫారం 6 ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.