Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
కేరళ రాష్ట్రం కొచ్చిలో జరిగిన రూరల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావును పాలకవర్గం శుక్రవారం ఘనంగా సాలువతో సత్కరించి, జ్ఞాపికను అందించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ పురోగతికి ప్రభుత్వం అందించిన విశిష్టమైన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవడం జరిగిందన్నారు. పాలకవర్గంను సమన్వయపరచుకుంటూ కేరళ రాష్ట్రంలో పంచాయతీలు జరిగిన మాదిరిగా చర్ల మేజర్ గ్రామపంచాయతీని తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ప్రజలందరూ సహకారంతో మునుముందు మన పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ సమన్వయం చేయడంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావుది అందవేసిన చెయ్యని ప్రశంసించారు. జిల్లాలు దాటి చర్ల మేజర్ గ్రామపంచాయతీ కీర్తిని రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలలోఉన్నతిని చాటడంలో పాలకవర్గం, కార్యదర్శి సఫలు అయ్యారని అభివర్ణించారు.
మేజర్ గ్రామపంచాయతీలో మునుపన్నడుగు జరగని అభివృద్ధి జరగడానికి పాలకవర్గం అంతా చదువుకున్నవారై ఉండడమేనని కార్యదర్శి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివలక్ష్మినారాయణ, వార్డు సభ్యులు దొడ్డి హరినాగవర్మ, ముత్యాల శివప్రసాద్, ఎం.సత్యనారాయణ, నీలం వెంకటరమణ, సింగా సంతోష్, కన్నారావు, పోలూరి సుజాత, రజిత, బొబ్బిలి ఇషాక్, సిబ్బంది ఉన్నారు.