Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం రక్షణ కల్పించాలి
- అటవీశాఖ అధ్వర్యంలో భారీ ర్యాలీ
- డీఎఫ్ఓ రంజిత్ నాయక్
నవతెలంగాణ-కొత్తగూడెం
అటవీశాఖ అధికారి ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు ఆశయాలు ముందు తీసుకెళ్తామని, ఆయన నిబద్ధత కలిగిన అధికారని శ్రీనివాసరావు అని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డీఎఫ్ఓ రంజిత్ నాయక్ అన్నారు. చండ్రుగొండ మండలంలో ఇటీవల గుత్తికోయల దాడిలో ధారుణ హత్యకు గురైన చలమల శ్రీనివాసరావు హత్యాకాండను నిరసిస్తు భారీ ర్యాలి నిర్వహించారు. దారి పొడుగుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ రంజిత్ నాయక్ మాట్లాడారు. శ్రీనివాసరావు మరణం అటవీశాఖ అటవీశాఖకు తీరనిలోటని, అడవుల సంరక్షణలో నిబద్ధతతో ఆయన ఎంతో కృషి చేస్తారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. అడవుల సంరక్షణలో నిబద్ధత కలిగిన ఉద్యోగిగా శ్రీనివాసరావు అవార్డు పొందారని ఆయనను ఆదర్శంగా తీసుకొని అడవుల సంరక్షణకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిఓలు అప్పయ్య, నీరజ్‌కుమార్, తిరుమలరావు, బాబు, దామోదర్‌రెడ్డి, డిఆర్ఓ, ఎప్ఆర్ఓలు, ఎఫ్హెచ్ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.