Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే గెలుపు
- విస్తృతస్థాయి సమావేశంలో విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా కార్యకర్తలు ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం వాసవినగర్ గిరిజన భవన్లో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి వంద ఓటర్లకు ఒక ఇంఛార్జ్‌ను నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా అభివృద్ది చేస్తున్నమన్నారు. ఏజేన్సీ గ్రామాల్లో అంతర్గత రోడ్లను పూర్తిగా నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే పినపాక నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో అభివృద్ధి చేస్తామన్నారు.
బీటీ రోడ్లకు శంకుస్థాపనా చేసిన రేగా
మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీలోని బీటీ రోడ్లకు విప్ రేగా కాంతారావు శంకుస్థాపనా చేశారు. శుక్రవారం వంద పడకల ఆసుపత్రి నుండి మద్దులగూడెం వరకు రూ.82 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పునరుద్దరణ పనులకు ఆయన శంకుస్థాపనా చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.