Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సర్వే సక్రమంగా చేయాలి : అఖిలపక్షం
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని సారపాక గ్రామ పంచాయతీలో శుక్రవారం నిర్వహించిన పోడు భూముల గ్రామసభలను రెడ్డి పాలెం, సారపాక గ్రామాలకు చెందిన పోడు రైతులు బహిష్కరించారు. పోడు భూముల సర్వే సక్రమంగా చేయాలని, అర్హులైన పోడు దారుల భూములను ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా లాక్కున్నారని, వాటిని వెంటనే పోడుదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలను బహిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2021 డిసెంబర్లో దరఖాస్తులు మొత్తం సారపాక 571, బుడ్డ గూడెంలో 176 దరఖాస్తులు వస్తే ఇప్పుడు సర్వేలో 150, సారపాక 250 సర్వే చేయకుండా రైతు భూములు ఫారెస్ట్ చేతిలో ఉందని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో సక్రమంగా సర్వే చేసిన తర్వాతే గ్రామసభలు నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ సభలో ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు మాట్లాడుతూ 571సర్వే చేస్తేనే ఫారాలపైన సంతకం చేస్తానని గ్రామ సభలో పోడు రైతులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామసభ వాయిదా పడింది. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వర్లు, ఎస్.కె. జేహీర్ పాషా, కనితి నాగయ్య, కారం హనుమంతు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకంచి శ్రీను, టి.ఏసు, పూర్ణ, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.