Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాలల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ-కొత్తగూడెం
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, ప్రత్యేక క్యాంపులు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ యువతను ఓట రుగా నమోదు చేయుటకు జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళా శాలల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రా ల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అర్హులను ఓటరుగా నమో దు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. గిరిజన ఆవాసాల్లో ఓటరు నమోదు కార్యక్రమం కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని చెప్పారు.
నియోజక వర్గాల్లో ఓటర్లు
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 1092 పోలింగ్ కేంద్రాల పరిధిలో 898409 మంది ఓటర్లున్నారు. వీరితో పాటు 729 మంది సర్వీసు ఓటర్లున్నట్లు చెప్పారు. గత సంవత్సరం డిసెంబర్ 12 నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు 8415 ఫారం 6 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో 6894 పరిష్కరించగా 1521 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. ఫారం 7కు 16522 దరఖాస్తులు రాగా 16065 దరఖాస్తులు పరిష్కరించామని, 457 తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. ఫారం 8కు 2670 దరఖాస్తులు రాగా 2130 పరిష్కరించామని, 540 దరఖాస్తులు తిరస్కరించినట్లు చెప్పారు. ఫారం 8కు 210 దరఖాస్తులు రాగా 179 పరిష్కరించామని, 31 దరఖాస్తులు తిరస్కరించినట్లు చెప్పారు. జిల్లాలో 25242 మందికి ఎపిక్ కార్డులు జారీ చేయాల్సి ఉందని, సత్వరమే ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 13611 మంది దివ్యాంగ ఓటర్లున్నారని చెప్పారు. పించన్లు ఆధారంగా అర్హులను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. ఈ సంవత్సరం జనవరి 5న ప్రకటించిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 907909 మంది ఓటర్లుండగా 7476 మందిని చేర్పులు చేశామని, మరణించిన 571 మందిని తొలగించామని, 1550 మంది. ఇతర చోట్లకు వెళ్లారని, 14855 మంది డబుల్ ఎంట్రీ అయ్యారని, మొత్తం 16976 మందిని తొలగించి ఈ నెల 9వ తేదీ 898409 మంది ఓటర్లుతో ముసాయిదా ప్రకటించినట్లు చెప్పారు.
జనవరిలో తుది ఓటరు జాబితా
2023 సంవత్సరం జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటించాల్సి ఉన్నందున నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులతో పాటు మరణించిన వ్యక్తుల పేర్లు తొలగింపు చేయాల్సి ఉన్నట్లు చెప్పారు. నూతన ఓటర్లు నమోదు పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని ఆయన సూచించారు. జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాల్లో ఎలక్ట్రో లిటరసి క్లబ్‌లు ఏర్పాటు చేసి స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
ఓటుహక్కు ఎంతో విలువైనది
ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎంతో విలువైనదని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. ఆరోగ్య వంతమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసు కుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ సిఈఓ రవికిరణ్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు గౌతం, వెంకటేశ్వర్లు, స్వర్ణలత, రత్నకళ్యాణి, విజయకుమారి, స్వీప్ నోడల్ అధికారి మధుసూదన్ రాజు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.