Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజులుగా కొనసాగిన గ్రామసభలు
- ప్రతి గ్రామ సభలో అంతా తానే వ్యవహరించిన ఎంపీఓ
నవతెలంగాణ-పినపాక
రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినటువంటి పోడు భూమి సర్వేలో భాగంగా పినపాక మండలంలోని మొత్తం 16 గ్రామపంచాయతీలో 30 హాబిటేషన్లో గత 15 రోజులుగా పోడు సర్వే పంచాయతీ కార్యదర్శులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందితో మండల వ్యాప్తంగా నిర్వహించారు. ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో బొమ్మరాజుపల్లి, పెంటన్నగూడెం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలో ముకుందాపురం గ్రామంలో గ్రామసభ శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వాయిదా పడుతూ ఉండటంతో మండల పంచాయతీ అధికారి బత్తిన శ్రీనివాసరావు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల, సహాయ సహకారాలతో పోడు గ్రామసభను ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించారు. సీఐ రాజగోపాల్, ఎస్ఐ టి.వి.ఆర్.సూరి, పోలీస్ సిబ్బంది సహకారం తీసుకున్న మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గ్రామస్తులకు పోడు భూములపై ప్రభుత్వ నియమ నిబంధనలు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. సర్వేలో ఎఫ్ఆర్సి కమిటీ సభ్యులు, మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అఖిలపక్షం నాయకుల ద్వారా పోడు గ్రామసభలు విజయవంతమయ్యాయని తెలిపారు. పోడు ముగింపు గ్రామసభలో ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ సెగ్గం నరసింహారావు, వార్డ్ మెంబర్ పసల నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి నాగిని, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అరుణ్, సాయి, అనూష, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, కృష్ణమూర్తి, అజార్, ప్రభాకర్, చంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.