Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సొంత స్థలం కలిగిన పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2న నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం స్కీం లో విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలందరికీ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి సంవత్సరాలు దాటిన మాటలు నీటిమూటలుగా మారాయని అన్నారు. అన్ని డివిజన్ లో సమగ్రంగా సర్వే నిర్వహించి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్, జబ్బార్, ఎస్. నవీన్ రెడ్డి, దొంగల తిరుపతి రావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.