Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్‌సి తాతా మధు
నవతెలంగాణ-వైరా
కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ, బాగా పెరిగిందని భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని ధరలు తెలంగాణలో ఉన్నాయని ఎంఎల్‌సి తాతా మధుసూధన్ అన్నారు. ఆదివారం వైరా మునిసిపాలిటీ 10వ వార్డు పరిధిలోని గండగల పాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన '' నిర్వణ'') లగ్జరీ విల్లా ప్లాట్స్ వెంచర్‌ను ఎంఎల్‌సి ప్రారంభించారు. అనంతరం వెంచర్ నిర్వాహకుడు దేవభక్తిని సుధర్మ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జోడో హౌమ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ నెలకొల్పిన ఈ వెంచర్ వైరా మునిసిపాలిటీకి తలమానికం కానున్నదని అన్నారు. మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉండటమే గాక త్వరలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే, ఇప్పుడున్న ఖమ్మం - సత్తుపల్లి రోడ్డును 4 లైన్ల రోడ్డుగా నిర్మాణం చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రెండు ప్రధాన రహదారుల మధ్య అత్యంత ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అద్దం పడుతుందన్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, పార్క్, ఆట స్థలాలు, బౌండరీ, సోలార్ ఫెన్సింగ్, పావెడ్ ఫుట్ పాత్, సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీ, వెట్ అండ్ డ్రై గార్బేజ్ డిస్పోజల్, ఇంట్రనల్ తారు రోడ్లు, అన్ని వేళలా సెక్యూరిటీ తదితర సౌకర్యాలతో జోడో హౌమ్స్ నిర్మాణం చేపట్టుటకు అనువుగా వెంచర్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. డీటీసీపీ అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, వైస్ చైర్మన్ ముళ్ళ పాటి సీతారాములు, మధు విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు, ఖమ్మం మునిసిపల్ కార్పొరేటర్ చావా నారాయణ రావు, దిశా జిల్లా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున రావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, డాక్టర్ కాపా మురళీ కృష్ణ, తాతా శ్రీనివాసరావు, దేవభక్తిని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి 50 వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వటంతో అక్కడే 6 ప్లాట్స్ కొనుగోలు చేశారు.