Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా గొల్లపూడి వృద్ధాశ్రమంలో వేడుకలు
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా మండలం గొల్లపూడి గ్రామంలోని వృద్ధాశ్రమంలో వైఎస్ షర్మిలమ్మ ప్రజాప్రస్థానం పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా వైరా మండల అధ్యక్షులు పీవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు, రాష్ట్ర యువజన సంఘం కో-కన్వీనర్ నంబూరి ఓంకార్ కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరై వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయోత్సవం వద్ధుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆత్మ సంతృప్తిని కలుగ చేసిందని, షర్మిలమ్మ ఎండనక, వాననక ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్వయంగా పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందుతూ విజయవంతం కావడం శుభపరిణామని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఆ పాలనకు గోరి కట్టేందుకు, వైయస్సార్ పాలన కోసం షర్మిలమ్మ పోరాటం చేస్తుందన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి అబద్ధపు పాలన కొనసాగిస్తున్నారని. వైయస్సార్ పాలన షర్మిలమ్మ తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు రాంబాబు నాయక్ , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు చింతల వాసు, జిల్లా యువజన అధ్యక్షుడు రాఘవ, వైరా నియోజకవర్గ బూత్ కోఆర్డినేటర్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైరా మండల అధ్యక్షులు పివిఎం ప్రసాద్, ఉపాధ్యక్షులు నల్లమోతు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వాకదాని శ్రీనివాస్ యాదవ్, యువజన సంఘం నాయకులు షేక్ సైదా, బీసీ సంఘం నాయకులు రాము, పాల్గొన్నారు.