Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్యెల్సీ బసవరాజు సారయ్య
- ఖమ్మంలో ఘనంగా రజకుల వనభోజనాలు ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ ఖమ్మం
సమాజంలో ఐకమత్యంగా ఉంటేనే తగిన గుర్తింపు అని మాజీ మంత్రి, ఎమ్యెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. ఖమ్మం నగరం గొల్లగూడెం చెరుకూరి మామిడి తోటలో ఆదివారం రజకుల వనమహౌత్సవం-ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వర్గమైన సమాజంలో ఐకమత్యంగా ఇకమత్యంగా ఉంటేనే తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని అన్నారు. కలసికట్టుగా ఉంటే సమస్యలు పరిష్కరించు కోవచ్చన్నారు. రజకులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రజక కుటుంబాలలోని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. ఎమ్యెల్సీ బస్వరాజు సారయ్యను సమైక్య రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దాతలను , వనబోజన నిర్వహణ కమిటీ నాయకులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. తొలుత మడెలెయ్య స్వామి, చిట్యాల ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మాజీ కౌన్సిలర్, జక్కుల లక్ష్మయ్య, ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి, కార్పొరేటర్ కమర్థపు మురికి, రేగళ్ల సీతారాములు, కొండలు, జక్కుల వెంకటరమణ, కణతాల నరసింహా రావు, మాచర్ల వెంకటేశ్వర్లు, ఎల్లేశ్, కుమారస్వామి, తెనాలి వీరబాబు, పంతంగి రవి, చట్టు మంగ, గోలి రామారావు, కొలిపాక వెంకట్, వట్టికోట దుర్గయ్య, సట్టు సత్యనారాయణ, గొట్టేపర్తి శ్రీనివాసరావు, కొండపల్లి రాంబాబు, మునగంటి శివ, తదితరులు పాల్గొన్నారు.