Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ-బూర్గంపాడు
గోదావరి వరద ముంపు బాధితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని, వరద బాధితులు పరిహారం అందలేదని తీన్మార్ మల్లన్న విమర్శించారు. పాదయాత్ర రెండో రోజైన ఆదివారం బూర్గంపాడు మండలం నాగి నేని ప్రోలు రెడ్డిపాలెం నుంచి ప్రారంభం అయింది. బూర్గంపాడు మీదుగా శ్రీధర, నగరం గ్రామాల నుంచి దంతెలబోర గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి ముంపు బాధితులకు ఇంతరవకు పరిహారం అందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టానని ఆయన వివరించారు. మరో ఉప ఎన్నిక వస్తేనే పినపాక అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఉప ఎన్నిక రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, తీన్మార్ మల్లన్నను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. స్థానిక పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు.